28/03/2024
https://youtu.be/J7co2N5-1Ls?si=d4UMmQlyY3cC0bY8 సినిమా పరిశ్రమకి వచ్చిన ప్రతి ఒక్కరికి చిన్న చిన్న కోరికలు ఉంటాయి. అవి తీర్చుకోవటానికి ప్రతి ఒక్కరు తనదైన స్టైల్లో కష్టపడుతుంటారు. నాకు కూడా ఇలాంటి చిన్న చిన్న కోరికలు ఉన్నాయి. సినిస్టార్ మ్యాగజైన్‌లో మాధవి అక్క, ఫ్రభు మామయ్య ఇచ్చిన అవకాశంతో ఫోటోగ్రాఫర్‌గా ప్రారంభమైన నేను తర్వాత కాలంలో అనేక వెబ్‌సైట్‌లకు పనిచేశాను. 2008 నుండి ఫోటోగ్రాఫర్‌గా, రిపోర్టర్‌గా, సీనియర్ రిపోర్టర్‌గా ‘సాక్షి’ దినపత్రికలో పనిచేస్తూ కొన్ని సినిమాలకు ఎగ్జిక్యుటివ్ ప్రొడ్యూసర్‌గా పనిచేశాను. సాక్షి పేపర్లో 13 ఏళ్లు పనిచేసిన తర్వాత ‘శివమ్ మీడియా’ పేరుతో మాదాపూర్‌లో ఆఫీస్ ఓపెన్ చేశాను. అక్కడ మ్యాజికల్ మూమెంట్స్ అనే ఈవెంట్ కంపెనీ, ట్యాగ్ తెలుగు.కామ్ వెబ్‌సైట్, ట్యాగ్‌తెలుగు, రెయిజ్ యువర్ వాయిస్ యూట్యూబ్ చానల్స్‌తో పాటు శివమ్ యాడ్ ఏజన్సీ ఏర్పాటు చేసి కొన్ని యాడ్స్‌ను తెరకెక్కించాను. రీసెంట్‌గా పాడ్‌కాస్ట్ కూడా చేస్తున్నాను. ప్రతి సమయంలో నా వెన్నంటి ఉన్న నా శివమ్ మీడియా టీమ్‌కి నా వైఫ్ సుజాతకు, తమ్ముడు మూర్తికి, మరో తమ్ముడు తాతా. పవన్‌కి చాలా చాలా థ్యాంక్స్. ఫైనల్‌గా శివమ్ మీడియా పేరుతో ప్రొడక్షన్ హౌస్‌ను ఈ రోజు నా స్నేహితులు యాక్టర్ అలీ, అనిల్ కడియాల, ప్రవీణా కడియాల ద్వారా బ్యానర్‌ని ప్రారంభించి ‘సత్య’ అనే సినిమా ద్వారా నిర్మాతగా మీ ముందుకొస్తున్నాను. ఈ అవకాశాన్ని ఇచ్చిన నిర్మాతలు బాబురెడ్డి, సతీష్ కుమార్, రాజశేఖర్ రెడ్డిలతో పాటు శ్రేయోభిలాషులందరికి థ్యాంక్స్ చెప్తూ బ్యానర్‌ని ప్రారంభించాను. నా ఈ ప్రయత్నంలో అందరి సహకారం ఉంటుందని కోరుకుంటూ మీ అందరితో ఎల్లప్పుడు ఆడుతూ పాడుతూ తిరిగే మీ స్నేహితుడు శివమల్లాల.
Actor Ali, Anil & Praveena Kadiyala Launched SivamMedia Banner & Production Logo | Siva Mallala| TT #...